Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 16 May 2016

రివర్స్ పంచ్

రివర్స్ పంచ్

అదేంటో
ఇలా ఎందుకు జరుగుతోందో
నా పలుకులు తూటాలుగా ఎందుకు పేలుతున్నాయో
నా అర్థాలు అనర్థాలుగానే ఎందుకు మారుతున్నాయో
ఏది చేసినా రివర్స్ పంచ్ పడుతోంది
నేను ఇలా ఎందుకు ఉన్నాను
నేనిలా లేనే
ఎందుకు ఇలా జరుగుతోంది
నా మాటలు మనసు ఒకటి కాదా
ప్రతిదీ అయోమయమేనా
నా చేతల్లో నిజాయితీ లేదా
నేను పువ్వులు విసిరితే
రాళ్ళుగా తగులుతున్నాయి ఎందుకు
నేను చేతిలో గులాబీ పడితే
నా నీడ చేతిలో తుపాకీ ఎందుకు
తప్పు నాదేనా
నా గుండెలోతులను తడమలేని
సమజానిదేనా ఈ అపరాధం
ఏం చేయగలను
కళ్ళున్నా
మనసులేని సమాజాన్ని చూసి నవ్వుకోవడం తప్ప
ఇంకేం చెయ్యగలను
మనస్వినీ

No comments:

Post a Comment