తిరిగిరాని గతం
నడిచే కాలం
కదిలే అడుగులు
ఆనవాళ్ళు గానే
మిగిలిపోతాయ్
కాలం జ్ఞాపకాలను
కానుకలుగా ఇస్తే
అడుగులు జాడలను విడిచి
కదిలిపోతాయ్
జ్ఞాపకాల దొంతరలు
మనసును వివర్ణం చేస్తే
అడుగుల జాడలు కాలమనే
గాలికి కరిగి చెరిగిపోతాయ్
మౌన ముద్ర మనసు
భావాలను సమాధి చేసి
వెక్కిరించే గడియారం
ముల్లును చూస్తూ ఉండిపోయింది బేలగా
కాలం సాగక తప్పదు
అడుగులు నడవక తప్పదు
కాలాన్ని ఆపలేక
అడుగులను అనుసరించలేక
మనసు నిలబడి పోయింది
ఒక చెదిరిన కలలా
తిరిగిరాని గతంలా
No comments:
Post a Comment