నాకూ కలలున్నాయ్
నీలినింగి రారాజు
చందమామను అందుకోవాలని
నాకూ ఉంది
దినకరుడిని ప్రభను
జయించాలనీ
ఉంది
పవనానికి ధీటుగా
పక్షిరాజునై
విహరించాలని
ఉంది
ఎదలోని సొదలా
రొదలు పెట్టే నదిలా
పరవళ్ళు తొక్కాలని
ఉంది
నాకూ మనసుంది
మనసులో కోరికలున్నాయి
కోరికలు కలలుగా
చివుర్లు మొలిచాయి
జీవనగమనంలో
సంధ్యాసమయం
ముంగిటవాలినా
ఆశలు
ఆకాంక్షలు
రెక్కలు విప్పుతూనే
ఉన్నాయి
కలలన్నీ
కల్లలుగా
ఆశలన్నీ
అడియాసలుగా
కన్నీటి దొంతరలుగా
దొరలిపోతూ ఉంటే
జారిపడుతున్న కన్నీటి
చుక్కలను
దోసిటపట్డడం మినహా
ఇంకేమి చేయగలను
మనస్వినీ
No comments:
Post a Comment