గుడ్డి మనసులు
మనసులో ఉన్నదేమో
మనసుకే తెలుసు
మనసులో రగిలే మంటల
వేడి ఎవరికి తెలుసు
మనసు గుడిలో మమతల తీపి
నా మనసుకు కాక మరో
మనసుకు ఎలా తెలుసు
నా కన్నులలో వికసించిన
కలలు
నా కన్నులకు కాక
ఇంకెవరికి తెలుసు
నా మనసు ఏం కోరుకుందో
నా మనసు ఏమని
ఆలోచిస్తుందో
నా మనసు ఎంత వేదన
పడుతోందో
నా మనసు ఎంత
విలపిస్తోందో
ఏ మనసుకు తెలుసు
ఆవేశంలో రగిలి
అనుమానంలో మునిగి
నిజానిజాలు
తెలుసుకోలేని
గుడ్డి మనసులు
నా మనసును చూడలేవన్నది
ఆ మనసులకు ఎలా తెలుసు
No comments:
Post a Comment