నేనంటే నేనే
నేను నేనేనా
నేను నేను కానా
నేను అలా ఉన్నానా
నేను అలా కనిపిస్తున్నానా
నేను అలా ఎందుకు ఉన్నాను
నేను ఇలా ఉన్నానుగా
నేను అలా ఎందుకు కనిపిస్తున్నా
నా ఆలోచనలు అలా ఉన్నాయా
నా అంతరంగం అదేనా
నా భావం నిజం కాదా
నా భాష్యం అంతా వేరేనా
నా లక్ష్యం వేరే ఉందా
ఎప్పుడూ నేను నేనుగానే ఉన్నాగా
ఎందుకు నేను అలా కనిపిస్తున్నా
ఎందుకు నాలో వేరే కోణం చూస్తున్నారు
నిజంగా నేను నేనేనా
లోపం నాలో ఉందా
నేనెప్పుడూ నేనే
నన్ను నాలా చూడలేకపోతున్నారెందుకు
అసలు నేను తెలుసా
నా మనసు తెలుసా
తప్పు నాదా
అర్థం చేసుకోలేని మీదా
కళ్ళున్నా మనసే లేని మనీ మనుషులకు
ఈ జన్మలో నేను అర్థం కాను
మనస్వినీ
No comments:
Post a Comment