ఎందుకీ జీవితం
ఆ కనురెప్పలు
విచ్చుకుంటే
ఉషోదయమే
అనుకున్నా...
కనురెప్పలు
వాలితే
సంధ్యా గీతమే
పాడుకున్నా
కనురెప్పల
నింగిలో
విహంగమై
విహరించా...
కనురెప్పల
వీధుల్లో
నిత్యాన్వేషినై
సంచరించా...
కంటిపాప
వెలుగుల్లో
వెన్నల
స్నానాలడుకున్నా...
ఇప్పుడా కన్నులు నాకు
అగ్నిగోళాలే...
కన్నుల నింగిలో
నా రెక్కలు తెగిపోయాయి...
కనురెప్పల వీధుల్లో
ముళ్ళ కంచెలే చుట్టుకున్నాయి...
కంటిపాపలు నన్ను
దూరంగా తరిమేసాయి...
కంటికి ఆనని ఈదేహానికి
ఇంకా జీవమెందుకు
మనస్వినీ...
No comments:
Post a Comment