Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 3 February 2016

కరుగుతున్న అక్షరం

కరుగుతున్న అక్షరం 

సిరా చుక్క కరిగిపోతోంది
అక్షరం వర్ణరహితమవుతోంది
భావం బయటికి రానని మొరాయిస్తోంది
కనులమైదానంలో మొలకలు వేసిన స్వప్నం
కన్నీరుగా కరిగిపోతోంది
చక్రంలా తిరిగిన కాలం
తిరగలేనని ఆగిపోయింది
స్థంభించిన కాలం
ముందుకు సాగనంటున్నది
ఎగసిన కెరటాలను
తీరం దూరం చేస్తున్నది
జరుగుతున్న ఘటనలను
మనసు మౌనంగా చూస్తూ ఉండిపోయింది
ఏమీ చేయలేక
భావాలను అణుచుకోలేక
ముందుకు సాగక
వెనకడుగు వేయక
గుభాళించలేక
ముడుచుకుపోలేక
నా కవిత్వం
పిచ్చి చూపులు చూస్తున్నది
మనస్వినీ

No comments:

Post a Comment