“మనీషి”
నీ జాడ తెలిసింది నాకు
నీ అసలు రూపం
తెలుసుకున్నా నేను
నీ అసలు రంగును చూసా
నేను
నువ్వెక్కడో లేవు
మబ్బుల మాటున లేవు
కొండల చాటున లేవు
దివిలో లేనే లేని
నువ్వు
భువిలోనే ఉన్నావు
మనీ రూపంలో ఇలలో
ఉన్నావు నీవు
కరెన్సీ రూపంలో మాయలు
చేస్తున్నావు నువ్వు
నువ్వు జేబులో ఉంటే
చెత్త వెధవ కూడా దేవుడే
కాసుల గలగలలు వినిపిస్తే
పచ్చి బూతులు కూడా వేదాలే
విటమిన్ ఎం దేహం నిండా
ఉంటే ఆ మనసుకూడా పునీతమే
మనీ ఉన్న “మనీషి” ఏం
చేసినా న్యాయమే
మనీ ఉంటే చాలు ఏదైనా
చేయొచ్చు
మనీ ఉంటేనే ఎవరికైనా
చేయూతనివ్వచ్చు
మనసు ఎంత విలవిలలాడినా మనీ ముందు దిగదుడుపే
మనీతోనే అనుబంధాలు
మనీతోనే పరువు
మర్యాదలు
మనీ ఉంటేనే గొప్పోళ్ళు
మనీ ఉంటే కుట్రలు
కుతంత్రాలూ న్యాయాలే
మనీ ఉంటే మతమేదైనా
గొప్పదే
మనీ ఉంటే శునకమైనా
సింహమే
మనీ లేని మనసు
పనికిరాని చెత్తకాగితమే
మనీషీ మరి నువ్వే కదా
దైవం
No comments:
Post a Comment