శ్రీమంతులు
ఒక చల్లని
చూపు
ఒక తీయని
పలుకు
ఒక మనసైన
ఓదార్పు
ఒక అర్థవంతమైన
నమ్మకం
ఒక నులి
వెచ్చని స్పర్శ
ఒక ఆశ
ఒక ఆకాంక్ష
మండుతున్న
జీవన కొలిమిలో
ఆ చల్లని చూపే
మంచు ముత్యం
ఆ తీయని పలుకే
జీవనాధారం
మనసైన ఓదార్పే
కలిగించు ధైర్యం
ఆ నమ్మకమే
ముందుకు నడిపే మార్గం
ఆశ నుంచి
జనియించే ఆకాంక్ష
అనురాగానికి
ఇచ్చును రక్ష
చూపుల వెన్నెల
కురవకపోతే
తేనియ పెదాలు
రసాలు చిలికించకపోతే
అనుమానంలో
మునిగిన ఆవేశం
ఓదార్పును
మింగివేస్తే
సిరి సంపదలు
గుట్టలుగా ఉన్నా
భోగ భాగ్యాలు
తోరణాలు కట్టినా
ఆ జీవనం ముళ్ళ
కిరీటమే కాదా
అనుబంధమే
వికసిస్తే
నిరుపేద కూడా
శ్రీమంతుడే
కాదా
No comments:
Post a Comment