సమాజానికి సవాల్
సమాజమా నీకిదే నా
సవాల్
నువ్వే చాలా గొప్పని
విర్రవీగుతున్నావా
నీలోనే నిజాయితీ ఉందని
భ్రమ పడుతున్నావా
తెలుసా నీకు జీవితం
తెలుసా నీకు బంధం
తెలుసా నీకు అనుబంధం
దుష్ట దుర్మార్గుల
సమూహమే నువ్వు
భువిలో వెలిసిన కలుపు
మొక్కల సమాహారం నువ్వు
వేద మంత్రాలు పారాయణం చేస్తూ
వేద మంత్రాలు పారాయణం చేస్తూ
ఖురాన్ ఆయత్తులు
వల్లెవేస్తూ
నీఛ తంత్రాలు రచించే
జాతి నీది
మగువ మనసు గ్రహించక
ఆ మనసు విలువ తెలియక
నిజమేదో గ్రహించక
నోరుంది కదా అని
ఏదనుకుంటే అది మాట్లాడేది నువ్వు
మీకూ బంధాలు లేవా
భార్యా బిడ్డలు లేరా
నువ్వు తండ్రివి కాదా
ఒకరికి మొగుడివి కాదా
నీకు మొగుడు లేడా
నీకు తల్లి లేదా
బిడ్డలు పుట్టలేదా
ఎందుకు మగువ జీవితంతో
ఆటలు
కుట్రలు కుతంత్రాల్లో
మునిగి
కరెన్సీ వాసనలో నలిగి
ఎందుకు
మానవత్వాన్ని
చంపుకుంటన్నావ్
ఒకరి ఇల్లాలిని
ఒకరి భర్తని
గౌరవించలేని నువ్వు
నీ ఇంటి మనిషిని ఎలా
గుర్తిస్తావ్
నో డౌట్
అది నా బంధం
నా అనురాగం
నా బంధానికి నేను
ప్రాణమిస్తా
నా అనుబంధానికి నేను
విలువ ఇస్తా
కుక్క మూతి పిందెను
పోలిన సమాజమా
నీకేం తెలుసు బంధం
విలువ
నీకేం తెలుసు
భార్యాభర్తల బంధం
చిలుకపలుకులు పలికే
కుక్కజాతి జంతువుల్లారా
మీ మాటలకు కుక్కలే
సిగ్గుపడుతున్నాయ్
నీ ఇల్లాలిని
ఉంపుడుగత్తె అని ప్రకటించు
ఆడదానివైతే నువ్వే వెలయాళివని
చెప్పుకో
ఉందా దమ్ము నీకు
దమ్ముంటే రా నా
ముందుకు
మనిషి జాతివైతే
ఇదే నా సవాల్
No comments:
Post a Comment