స్నేహమా ఎక్కడా నీ చిరునామా
కనురెప్పలకు భారమైన ఓ
నీటి చుక్క
ఇక సెలవంటూ కిందకు
జారింది
ఒంటరిగా నేను పోలేనంటూ
అందరినీ తోడు రమ్మని
పిలిచింది
ఒక చుక్కకు మరో చుక్క
తోడై
ప్రవాహమై ఉబికింది
మనసు సంద్రంలో
సునామిలా ఎగసిన ప్రవాహం
ప్రతి జ్ఞాపకాన్నీ
తుడిచేసింది
మనసు పొరలకు చీడలా
అంటుకున్న
ప్రతి ఆనవాలునూ
కడిగేసింది
కన్నీటి ప్రవాహంలో
తుడుచుకుపోయిన
జ్ఞాపకాల్లో
కరిగిపోయిన ఆనవాళ్లలో
చీడపీడలు
కొట్టుకుపోయాయి
మిగిలింది మనసే
నా అనుకున్నది నాది
కాదన్నది తేలిపోయింది
అది స్నేహం ముసుగులో
పచ్చి వ్యాపారమేనని తెలిసిపోయింది
అన్నదమ్ముల అనుబంధంలో
బంధువుల అనురాగంలో
అంతా వ్యాపారమే
అనుకున్న నేను
స్నేహంలో నిజాయితీ
ఉందనుకున్నా
స్నేహమూ వ్యాపారమనే
చెట్టుకు కాచిన కాయేనని
తెలుసుకున్న మనసు
గుండెలుపగిలేలా
ఏడ్చింది
మనసు సుడిలో ఇమడలేని
కన్నీటి చుక్క
కిందకు జారుతూ
మనీ మనుషుల ఆనవాళ్ళను
కడిగేసింది
ఇప్పుడు
నా మనసు నిలదీసి
అడుగుతోంది
స్నేహమా ఎక్కడా నీ
చిరునామా
No comments:
Post a Comment