వయసు తరిగింది
తరుగుతోందా
పెరుగుతోందా
పెరుగుతున్న ప్రాయంతో
పరువం పోటీ పడుతోందా
కన్నులలో వెన్నల
దొంతరలు
మరింత
కాంతివంతమవుతున్నాయా
పెదాల మధురిమలు
ఇంకా తేనీయలు
పులుముకుంటున్నాయా
నీలి మేఘమాలికలు
కురులు
మరిన్ని నిశి
దుప్పట్లు పరుస్తున్నాయా
కురుల మేఘాల నీడన ఆ
మోము
చంద్రబింబంలా మరిన్ని
వెలుగులు సంతరించుకుందా
మఖ్మల్ మెత్తదనాల
కరములు
గుండె సవ్వడులను
కదిలించే
అందియల చప్పుళ్ళు
రోజు రోజుకూ కొత్తగానే
కనిపిస్తున్నాయి
కాలం గడుస్తున్నా
గడియారం ముళ్ళు
పరుగులు తీస్తున్నా
ప్రకృతి అలసి
సొలసిపోతున్నా
నీలో మాత్రం రోజూ
కొత్తదనమే
ఇంతకీ
నీ ప్రాయం పెరుగుతోందా
తరుగుతోందా
మనస్వినీ
No comments:
Post a Comment