కవులు రాయని
అక్షరం నేను
రవి చూడని క్షేత్రం నా
హృదయం
కవులు రాయని అక్షరం నా
మానసం
అర్థం కాని భావం నా
అంతరంగం
తప్పు నా హృదయానిదా
నేరం నా మనసుదా
అర్థమే కాని
అంతరంగానిదా
లోపం నాలోనే ఉందా
పాపం నా మనసే చేసిందా
కనులతో తప్ప మనసుతో
చూడలేని మనుషులదా
ఆవేశమే తప్ప ఆలోచనే
లేని మనసుదా
నా మనసుకు తెలుసు
అన్నీ
మనసు లోతును గ్రహించని
మనసు ఎగసిపడినా
నాపై లేని నిందలు
మోసినా
అర్థమే కాని ఆరోపణలు
గుప్పించినా
ఏమి చేయగలను
నా మనసును చూసే శక్తి
లేదని
సరిపెట్టుకోవటమే ఇప్పుడు
నా జీవితం
మనస్వినీ
No comments:
Post a Comment