మళ్ళీ పుడుతున్నా
మరణిస్తున్నా
మెల్లమెల్లగా
మళ్ళీ పుడుతున్నా అంతే
కొత్తగా
వాడిన మానుకు మారాకు
తొడిగినట్లు
ఎండిన కొలనుపై
చిరుజల్లు కురిసినట్లు
బీడువారిన పుడమిలో
గింజ విచ్చుకున్నట్లు
చిగురిస్తున్నా
మెల్లమెల్లగా
కుట్రలు తెలుసు
కుతంత్రాలు తెలుసు
నిజాలు తెలుసు
అబద్దాలు తెలుసు
మాయలు తెలుసు
మర్మాలూ తెలుసు
అన్నింటినీ
త్యజిస్తున్నా మెల్లమెల్లగా
పులకించిన మనసుకు
సంకెలలు వేస్తున్నా
స్పందించిన మనసుకు
సమాధి కడుతున్నా
సమాధి గోడలు బద్దలు
కొడుతున్నా మెల్లమెల్లగా
నాలా నేను బతకలేనని
తెలిసి
నేను నేనే కాదని
గ్రహించి
కుబుసం విడిచిన నాగులా
గులాబీలో ముల్లులా
మనసులేని మరమనిషిలా
మళ్ళీ పుడుతున్నా
మనస్వినీ
No comments:
Post a Comment