టైం మిషిన్
కావాలి
వెళ్లి పోవాలని వుంది
మరలా అక్కడికే
వెళ్లాలని వుంది
ఆ నులివెచ్చని
పొద్దును
మళ్ళీ ముద్దాడాలని
వుంది
ఆ చల్లని సాయం సంధ్యలో
మళ్ళీ సేదతీరాలని
వుంది
గతం తాలూకు ఘడియలను
చుంబించాలని వుంది
చాచిన చేతులనుంచి
చేయూతనిచ్చే దశను
మళ్ళీ చేరాలని వుంది
ఆనందం ఘడియల లోతులను
మళ్ళీ చవి చూడాలని
వుంది
నా ఆనందం
అందరికీ మహదానందంలా
పంచి ఇవ్వాలని వుంది
జారిపోయిన వైభవ
శిఖరాన్ని
మళ్ళీ నిలబెట్టాలని
వుంది
విరిగిపోయి కరిగిపోయి
కలగా మిగిలిన
అనుభూతులను
మళ్ళీ కళ్ళలో
నింపుకోవాలని వుంది
నా పెదాల నవ్వులను
అందరి చిరునవ్వులుగా
మలుచుకోవాలని వుంది
ఏం చేయను
కాలాన్ని వెనక్కి
తీసుకెళ్ళే
టైం మిషిన్ నాదగ్గర
లేదుగా
మనస్వినీ
No comments:
Post a Comment