సమాజమా జాగ్రత్త
ఇదే మంచి తరుణం
మించిన దొరకదు
ఇదే మంచి అవకాశం
ఇదే అసలైన అదను
అవకాశం జారవిడుచుకోకు
దెబ్బ మీద దెబ్బతో
నేలకరిచిన నన్ను మరలా
లేవనీయకు
కసితీరా ఆడుకో
తగిలిన గాయంపైనే మరలా
దాడి చెయ్
మనసును సమాధి చేసిన
నువ్వు
దేహాన్నీ ఖననం చెయ్
కదలనీయకు
తల ఎత్తనీయకు
కనులు తెరవనీయకు
శ్వాస ఆడనీయకు
నలువైపులా కరవాలములు ప్రయోగించు
లేవాలన్న ఆశయాన్ని
సంహరించు
సమాజమా ఇది సమరం కాదు
ఇది నువ్వు చేసిన
దందయాత్రే
కొనసాగించు నీ జైత్ర
యాత్ర
భస్మీపటలం చేయ్
జీవితాన్ని
నువ్వే నిజం
నీ కుట్రలు న్యాయం
నీ ఆటలే ధర్మం
కర్తవ్యాన్ని త్యజించి
భావావేశం మత్తులో
మునిగిన మనసుకు
మరణదండన వేయ్
కసితీరా నాశనం చేయ్
ఏమరుపాటుగా ఉన్నావో
మరలా లేస్తా
పడిలేచిన కెరటంలా
దూసుకువస్తా
మరోజన్మలా ఉబికి వచ్చే
దానవుడి పుట్టుకను
నిలువరించుమా సమాజమా
No comments:
Post a Comment