ఇవి దస్తావేజులు కావు
కనికట్టుకాదు నా
అక్షరాలు
మంత్రాలు తెలియనివి నా
భావాలు
మాయాజాలం నేర్వలేదు నా
కవితలు
మనసు సంద్రంలో
జనియించిన హాలాహలం
వెనువెంటనే ఉబికిన
మధురామృతం
అన్నీ కలగలిపిన రూపమే
నా భావం
తీపీచేదు కలయికే నా
కవిత్వం
లక్ష్యం లేదు
గమ్యం లేదు
మాయా లేదు
మర్మం లేదు
మనసు తోటలో పుష్పమే నా
అక్షరం
మనసు మేఘం నుంచి
వర్షించిన నా అక్షరాలు
గులాబీపువ్వులై నచ్చిన
మనసుకు గుచ్చుకుంటే
మనసైన మనసు మనసుకు
సలాం చేస్తే
అది అక్షరాల తప్పెలా
అవుతుంది
వేదమంత్రాలు వల్లెవేస్తూ
నీఛ తంత్రాలు చేయలేదు
నమాజులో సజ్దాలు
చేస్తూ
కుతంత్రాలు రచించలేదు
మనసు వేదనే రాసుకున్నా
మనసు పులకింతలే
అద్దుకున్నా
పవిత్రమైన భావాలకు
మరో మనసు పునీతమైతే
నా కవితల తప్పెలా
అవుతుంది
ఆస్తులకోసం రాసుకున్న
దస్తావేజులను
దుప్పటిలా కప్పుకునే గోముఖ వ్యాఘ్రాలకు
మనసు బాసలు ఎలా
అర్థమవుతాయి
మనస్వినీ
No comments:
Post a Comment