పువ్వులా
పిడుగులా
మేఘ మాలికల సంగమంలో
జనియించెను అగ్నిధార
పచ్చని పుడమిపై
ఎగసేను జ్వాల
రగిలిన మంటలో
నోరువిప్పిన అగ్ని
గుండంలో
నివురులా మారెను నేల
అది ప్రకృతి
అది దాని ధర్మం
మనసులు మేఘమాలికలు
కాకున్నా
ఈ రాపిడి ఎందుకు
ఇరుమనసుల సంఘర్షణ
ఎందుకు
ముద్దాడే మనసుల మధ్య
ఆవేశమనే అగ్గి ఎందుకు
మేఘాలకు మనసు లేదు
భావాలు లేవు
ప్రకృతి నిర్దేశిత
క్రీడ అది
పిడిగులు మబ్బుల నైజం
శతకోటి భావాల సమూహాలు
మనసులు
మనసుల మధ్య అంతరం
ఎందుకు
ఆలోచనలకు అందని ఆవేశం
ఎందుకు
మేఘాలు తమ ధర్మం
పాటిస్తే
దగ్గరయినా దూరమని
భావించే మనసులు
వికృత దిశలో పయనం
ఎందుకు
ఎగసిపడిన ఆవేశంలో
అర్థం లేని ఆవేదనలో
పొంతన కుదరని వాదనలో
శరపరంపర ప్రశ్నలతో
మనసులు సంఘర్షణకు
గురైతే
ఆ మనసుల పొదరిళ్ళలో
పిడుగులు కాక
పువ్వులు వికసిస్తాయా
మనస్వినీ
No comments:
Post a Comment