కాలమా ఆగిపో
మనసు లేదు నీకు
కరుణ తెలియదు నీకు
కన్నీటి విలువ తెలియదు
నీకు
చిరునవ్వుల వెనుక
విషాదం చూడవు నీవు
నీకు తెలిసింది ఒక్కటే
ఆడుకోవటం
చదరంగంలో పావులు కదపటం
నీ ఉనికిని చాటే
గడియారం ముల్లు చూడు
ఎంత ప్రశాంతంగా
నడుస్తున్నదో
మరి నీకేమయ్యింది
ఎందుకీ దోబూచులాటలు
ఓడలను బళ్ళుగా
బళ్లను ఓడలుగా
మార్చేస్తావు
ఉన్నత శిఖరాలను నేల
కూలుస్తావ్
కుక్కలను సింహాసనాలపై
కూర్చోపెడ్తావ్
శిఖరాల శిథిలాల కింద
నలిగిన మనసులు చూడు
రాజ్యమేలుతున్న కుక్కల
లీలలు చూడు
మనసున్న మనుషులను
వేధించి
మనీ మనసులకు అందలాలు
కల్పించే నువ్వు
ఎందుకిలా
ఆడుకుంటున్నావు
మనిషిని బొమ్మగా
మార్చిన కాలమా
ఆగిపో
No comments:
Post a Comment