దప్పిక తీరేనా
పూదోటల్లో విహరించిన
భ్రమరం
ఎండుటాకుల్లో
చిక్కుకుపోయింది
తేనీయ కాదు
చుక్క నీటికోసం
రెక్కలు విప్పుతున్నది
వాలిన రెక్కలను మరలా
ఆడించేందుకు
నానాయాతన పడుతున్నది
ఎదురుగా అగుపించే
చెలమలను గాంచి
కొత్త ఊపిరులు
పోసుకుంది
చుక్క నీటికోసం
చిట్టి గొంతు దప్పిక
కోసం
పడి లేచిన కెరటంలా
సునామీలా ఎగదన్నే
పిల్లవాయువులను చీల్చుకుంటూ
అది ముందుకు
సాగుతున్నది
ఆ భ్రమరం దప్పిక
తీరేనా
కొత్త ఊపిరులు అందేనా
అవి నీటి చెలమలు కాదు
ఎండమావులని
పాపం అది
తెలుసుకోలేకపోయింది
మనస్వినీ
No comments:
Post a Comment