వందనం అభివందనం
నా అక్షరాన్ని
ఒక పువ్వుగా మలుచుకుని
ముద్దాడిన నీకు వందనం
నా భావాన్ని ఒక
ముల్లుగా అనుకుని
బాధపడిన నీకూ ఒక వందనం
నా కవితను మనసుతో చూసి
ఒక్క చుక్క రాల్చిన
మనసుకు అభివందనం
నా అక్షరాలను మనసు
పుష్పాలుగా గుర్తించిన
మనసుకో వందనం
నా మనసు రొదలను చూసి
లాలించిన
మంచిమనసుకూ వందనం
నవ్వుకున్న వారికీ
గేలి చేసినవారికీ
బాధపడిన వారికీ
ఒదార్పునిచ్చిన వారికీ
నా ఐదు వందల కవితలను
ఆదరించిన అందరికీ
నా భావనకు మూలమై
నా కవితకు ఆలవాలమై
నా జవమూ జీవమై
అక్షరమాలికకు ప్రాణమై
నిలిచిన
మనస్వినికి శతకోటి
వందనం
No comments:
Post a Comment