సమాధిని నేను
కన్నుల వెన్నెలను కాను
పెదాలపై మెరుపును కాను
గమ్యానికి లక్ష్యమూ
కాను
ఆరాధ్యుడినీ కాను
ఆరాధనకు నోచుకోను
అడుగులకు బాటను కాను
వాడిన పెదాల సంకేతం
నేను
కనుల చిందే కన్నీరును
నేను
బాటలు లేని అడుగును
నేను
నిశ్చలం నేను
నిర్జీవం నేను
ఆర్తిగా ఎదురు
చూస్తున్న శూన్యం నేను
విరిసిన కుసుమాల కోసం
నిరీక్షిస్తున్న మట్టి
కుప్పను నేను
నన్ను ముద్దాడే
కుసుమాలు
భక్తితో జారవిడిచే
కన్నీటి చుక్కలకోసం
దాహంగా ఎదురుచూసే
సమాధిని నేను
No comments:
Post a Comment