నీలో నేనై
నిన్ను చూడాలని
నీ కన్నుల వెన్నెలలో కరిగిపోవాలని
వెన్నెల స్నానం చేయాలని
నిన్ను తాకాలని
సిరిమల్లె సొగసులు అందుకోవాలని
నీ ఒంటిపై జారిపడిన నీటి చినుకునై
ఎదలోతులలో పరవశించాలని
కరిగిపోవాలని
నులివెచ్చని పయ్యెదలపై
గోరువెచ్చని ఆవిరినై కరిగిపోవాలని
జారిపొవాలని
ఉబికిన పరువాలను స్పృశించి
నడుము వంపుల్లోకి జారిపొవాలని
లీనమవ్వాలని
మెలికలు తిరిగిన నడుమును ముద్దాడిన
స్వేదబిందువునై
నీ పరువంలో లీనమవ్వాలని
ప్రియా
ఇవే నా చిన్ని చిన్ని కలలు
నిత్యం నూతనం నా మానసం
ప్రతి దినం
ప్రతి ఘడియ
నీలోనే నేనై మిగిలిపోవాలని
నా ఆశల పయనంలోనే
తుది శ్వాస వీడాలని వుంది
మనస్వినీ
No comments:
Post a Comment