నా మనసు నా ఇష్టం
జనారణ్య రోదనలో
పొగ ధూళి మేఘాలలో
వాయువేగంతో
దూసుకుపోతున్న వాహనాలు
రోడ్డు దాటుతున్నావు నీవు
వాహన వలయాన్ని ఛేదించుకుంటూ
వడి వడి అడుగులు
వేస్తూ ముందుకు సాగుతున్నావు
నీతో నడుస్తున్నాను
నేను
అప్రయత్నంగానే
నా చెయ్యి నీ
చేయ్యినందుకుంది
నా చెయ్యి పట్టుకోవటం
అవసరమా అని
నీలో నీవే
గొణుగుతున్నా
ఆ మాటలు నాకు
వినిపిస్తూనే ఉన్నాయి
అవును నాకు అవసరమే
నీవు ధీర వనితవైనా
ఓ సామ్రాజ్యానికి
అధినేత్రివైనా
కష్టాల కడలిని దాటే
వీరనారివైనా
అబలను కాదు సబలనే
అనుకున్నా
నా మనసుకు బేలవే
నా కన్నులకు ఓ అందమైన
పూరెమ్మవే
నాకు అవసరంముంది నీ
క్షేమం
నా మనసు కోరుకుంటుంది
నీతో పయనం
అందుకే నా చెయ్యికి
మనసే చెప్పిందేమో
నీ చెయ్యిని
అందుకొమ్మని
నీకు నేను ఏమీ కాకున్నా
అందరిలాగే నేనూ అన్నా
అందరిలో ఒకడినే అయినా
నువ్వు నాకు
ప్రత్యేకమే
నీవు నాకు అందరిలో
నువ్వు కాదు
ఎందరిలోనో నీవు లేవు
మరెక్కడో నీవు లేవు
నిత్యం నా ఊపిరిలో
ఉండే నీకు
నేను అర్థం కాకపోవచ్చు
నా బలహీనతలు నీ కనులకు
పరదాలు తొడగవచ్చు
నీవు కించపరిచినా
ద్వేషించినా
మనోపాతాళంలో పాతి
పెట్టినా
నేనేమీ చేయలేకున్నా
నీ గురించే ఆలోచిస్తా
నిన్నే మనసులో
నింపుకుంటా
నా మనసు నా ఇష్టం
i love u till my last breath. you receive it or not. this is pure love.
ReplyDeleteone side love..manchidi kadu
Deleteevaru baboy....
ReplyDelete