నవ ప్రస్థానం
పగుళ్ళు బారిన పుడమిలో
లేత మొలక ఉదయించింది
రెక్కలు విచ్చుకుంటూ
నింగి వైపు చూస్తోంది
అవనిని దాటి
గగనసీమవైపు అడుగులు వేసింది
మోడు వారిన మానులో
మారాకు మొగ్గ
తొడిగింది
చిగురించిన ఆశతో
గమ్యాన్ని
అన్వేషిస్తోంది
కారు చీకటి బాటలో
చంద్రోదయం ఉదయించింది
నిశి తెరలను
చీల్చుకుంటూ
వెలుగుతీరాలకు ఎగసింది
ఆగిన జీవన చక్రం
ప్రగతి దిశన కదులుతోంది
దోబూచులాడిన గమ్యం
మరో ప్రస్థానానికి
తెరలేపింది
ఆగనివ్వను పయనమంటూ
నెచ్చెలి మనసు
జతగూడింది
రగిలిన మనసుల పంతం
మరో చరితకు శ్రీకారం
చుట్టింది
మనసుల గమనంలో
తొలకరి జల్లు
పరిమళించింది
ఓడిన మెట్టుపైనే
గెలుపు మార్గం
మొదలయ్యింది
కూలిన శిఖరానికి
మనసు పునాది లేచింది
ఇక ఆగదు పయనం
చేరకతప్పుదు గమ్యం
మనసూ మనసుల మేళవింపు
నవశకానికి మేలుకొలుపు
మనస్వినీ
No comments:
Post a Comment