మనసా మన్నించవే
ఒంటరి మనసు నీది
ఆ మనసులో అంతుచిక్కని
వేదన ఉంది
మెరుపులు చిమ్మే పెదాల
మాటున
తీయని పలుకుల్లో ఏదో
తెలియని నిర్వేదం ఉంది
వెన్నెల కురిపించే నీ
కను రెప్పల మాటున
ఎవరికీ తెలియని కన్నీటి
సంద్రం ఉంది
చిరాకు పుట్టించే నీ
చేష్టలు
ఆ చేష్టల వెనుక
అంతుపట్టని అంతరంగం ఉంది
ఊగిపోయే ఆవేశం నీది
ఆవేశం మాటున ఒక అర్ధం
ఉంది
నా మనసును నొప్పించే
నీ పలుకుల్లో
నిఖార్సైన నిజం దాగి
ఉంది
నాకు తెలుసు నీ మనసు
వేదన
నా మనసుకు తెలుసు నీ
రోదన
కడగండ్ల మనసులోని
అంతరంగం
నా మనసు అంతరాలకు
తెలుసు
స్వాంతన కల్పించాలని
నా మనసూ కోరుకుంటోంది
చేతకానిదైన నా మనసు
నిస్తేజమై చూస్తోంది
కష్టాల కొలిమిలో
రగులుతున్న నా మనసు
దిక్కులేనిదయ్యింది
ప్రగతిబాటలో
అడుగులజాడలు
వదిలిన మనసుకు బాసట
ఇవ్వలేకున్నది
నీ మనసు మంటకు బీజం
వేసిన నా మనసు
సిగ్గుతో తలదించుకుంటున్నది
భారమైన నా మనసు
నీ వేదనకు చేయూతనివ్వక
మౌనంగానే
ప్రణమిల్లుతున్నది
మన్నించు మనస్వినీ
అనుకుంటూ
మూగగా రోదిస్తున్నది
No comments:
Post a Comment