Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 7 June 2015

ఏందిలా అత్ల తూత్తున్నవ్!!!

ఏందిలా అత్ల తూత్తున్నవ్!!!


రోడ్డుపక్కన కారు ఆపుకున్నాను
దమ్ము కొట్టాలనిపించింది
మెల్లగా విండో గ్లాస్ కిందికి దించుకున్నా
సిగరెట్ వెలిగించుకుని దమ్ము లాగుతూ ఏదో ఆలోచిస్తున్నా
కార్ సైడ్ మిర్రర్ లో అందమైన మహిళ
ఆమెతో ఇద్దరు చిన్నారులు
ఓ పాప బాబు
బాబుకి ఎనిమిదేళ్లుంటాయి
పాపకేమో ఆరేళ్ళు ఉండొచ్చు
వాళ్ళు కారును సమీపించి ముందుకు వెళుతున్నారు
అంతలో పాప చెప్పు ఒకటి ఊడిపోయింది
చెప్పును సరిచేసుకుంటూ నా వైపు చూసింది
నేనూ ఆమెనే చూస్తున్నా
నన్ను చూసి ఆరిందాలా కను బొమ్మలు ఎగురవేసింది
నేనూ అలాగే చేశాను
అంతలోనే ఏమనుకుందో ఏమో
నా వైపు కోపంగా చూసింది
ముందుకు వెళుతూ నాపై ఓ మాట బాణం విసిరింది
ఏమందో తెలుసా
ఏందిలా అత్ల తూత్తున్నవ్
అంటూ ముందుకు వెళ్ళిపోయింది
కొద్ది సేపు అర్థం కాలేదు
తర్వాత నవ్వాపుకోలేకపోయాను
అమ్మో గడుసరి
ఇప్పుడే ఇలా ఉంటే
పెద్దయ్యాక బాంబే అనుకున్నా
బుజ్జాయి మాట
మాట్లాడిన తీరు చూసి
మనసారా నవ్వుకున్నా

2 comments:

  1. ఏది ఏమైనా మీరు పొగత్రాగడం హానికరం :-)

    ReplyDelete
    Replies
    1. నిజమే ...మానాలనే అనుకుంటున్నా కావటం లేదు పద్మాజీ...

      Delete