చితిమంటల్లో మనసు
మనసులోని
భావాలు పెనవేసుకుంటున్నాయి
అంతరంగంలోని
అంతరాలు ఘర్షించుకుంటున్నాయి
పెదాలు దాటని
మాటలు మనసులోకి జారుకుంటున్నాయి
పలకరించాలన్న
ఆరాటం బండబారిపోతోంది
సంఘర్షించిన
బాసలు బాధలుగా మిగిలిపోతున్నాయి
భావాల
రాపిడిలో అగ్ని కణికలు పుడుతున్నాయి
ఎగసిపడిన
నిప్పురవ్వలు మనసుకోటను దహిస్తున్నాయి
మనోసీమలో
అగ్గిమంటలు కనుమలను కాల్చేస్తున్నాయి
చితికిన మనసు ఆశలు
చితిమంటలను తలపిస్తున్నాయి
రగిలిన మనసు
భావాలు పొగమేఘాలై
కన్నీటిని
కురిపిస్తున్నాయి
మనసులో రగిలే
వేదనలు
సంఘర్షించే
భావాలు
పెదాలు దాటి
రానప్పుడు
మిగిలేది
కన్నీరే కదా
గుండె రగిలి
కనుల మేఘం
కరిగి
కురిసే
కన్నీటి చుక్కల్లో
నేను మరలా నా
భావాలనే వెతుక్కుంటున్నా
కరిగిపోతున్న
భావాలను దోసిటపట్టి
నా గుండెలోనే
నింపుకుంటున్నా
నా జ్ఞాపకాలతో
పెనవేసుకున్న నా భావాలు
నా మనసును
వీడి పోవటం
నేనెలా
భరిస్తాను
మనస్వినీ
love u raja . this is real poetry
ReplyDelete