ఆరాధకులెందరో ఆస్వాదకుడు ఒకరే
ఆ తీయని పలుకుల మధురం
ఎందరికో ఇష్టం
ఆ పెదాల మెరుపులు
అందరికీ ప్రమోదం
ఆ కన్నుల వెన్నెలలో
ఆడుకోవాలని ఎందరికో తాపత్రయం
తీయని స్వరంతో స్వరం
కలపాలని కొందరు ఆశిస్తే
పెదాల మెరుపుల్లో
పునీతం కావాలని మరికొందరు
ఒకరు భావకులై పదాలను
అల్లుకుంటే
మరుజన్మంటూ ఉంటేనని
ఆశల పందిళ్ళు మరోకరివి
కన్నులవెన్నెలలో
సరిగంగ స్నానాలాడాలని
ఉబలాటపడేది మరో హృదయం
ఒక్కసారన్నా
ఆకర్షించాలని మరో మనసు ఆరాటం
సహజమైన స్వగతమిది
నిత్యం జరిగే మథనమిది
అందంగా ఉంటుంది గులాబీ
అది దాని జన్మ ఫలం
తీయగా పాడుతుంది కోయిల
అది దేవుడిచ్చిన వరం
అందానికి భాష్యం ఆ
అందమే
తీయని రాగానికి ఆలవాలం
ఆ స్వరమే
చందమామకు ప్రతిబింబం ఆ
వదనమే
నెమలి నడకకు నడత
నేర్పీది ఆ లాస్యమే
ఆ అందాన్ని
అభిమానించటం సహజ గుణం
ఆరాధించటం అర్ధవంతం
ఆరాధకులెందరో ఉన్నా
ఆస్వాదకుడు ఒకరే
ఇదే నిత్య సత్యం
No comments:
Post a Comment