గుంపులో గోవిందయ్య
నేనెందుకు ప్రత్యేకం
అందరిలో లేనిది నాలో
ఏమున్నది
నాలో లేనిది పరులలో ఏమున్నది
అందరిలాగానే నేను
అందరిలోనూ నేను
అందరిలాగే ఆలోచిస్తాను
అందరిలాగే కనిపిస్తాను
అందరిలాగే చూస్తాను
మరెందుకు నేను
ప్రత్యేకం
ఎందుకు కావాలి నేనే
కేంద్రం
నా ఆలోచనలో మార్పు
ఉందా
నా నడకలో
నా నడతలో తేడా ఉందా
నేనేంటో నాకే తెలియదా
ఇతరుల విలువ నాకు
తెలియదా
నా విలువను నేనే
పెంచుకున్నానా
భ్రమలే జీవన బాటలుగా
ఎంచుకున్నానా
నిజాలకు చెరువే కాలేనా
ఏమున్నది నాలో తేడా
అందుకే అందరిలాగానే
నేను
అందరిలోనూ నేను
అవును నేను
గుంపులో గోవిందయ్యను
excellent thought. this is the right attitude. nothing special about anyone.
ReplyDelete