అబద్దమే నిజం
సత్యము పలుకరాదు
జగతిలోన
అసత్యముదే విజయము
ఎప్పటికైనా
హితము చెప్పరాదు
తమవారికైనా
తీపి పలుకుల అబద్దమే
నచ్చు ఎవరికైనా
మాయా మర్మములదే గెలుపు
ఇలలోనా
నీతిమంతుడికి తప్పవు
పాట్లు ఎక్కడైనా
సొంత లాభము చూసుకో
ఎప్పుడైనా
నిన్నెవరూ చూడరు
జీవితానా
మనసా నేర్చుకో ఇదే
జీవన సత్యం
ఇదే లోకులకు వేదం
అందమైన అబద్దాన్నే
నిజమని నమ్ము
నిజం తెలిసినా గమ్మున
ఉండు
నిజం పలికి కష్టాలే
ఎదురైతే
అబద్దమే బతుకని
జీవించు
నమ్మబోకు ఎవరినీ
నమ్మేసానని నమ్మించు
అందరినీ
మాయానగరిలో
మరమనుషుల విపణిలో
సిరిసంపదల సంతలో
మనసు పెట్టి బతుకకు
ప్రేమా దోమలను తరిమేసి
అనుబంధాలను విసిరేసి
చాణక్య నీతిని పోగేసి
మెదడు చూపిన బాటలో
సాగిపో
అబద్దాలే జీవన బాటగా
మోసాలే శ్వాసలుగా
తమవారికే ఉచ్చు
బిగిస్తూ
పరాయివారినే అక్కున
చేర్చుకుంటూ
బతుకుబాటలో అడుగు తీసి
అడుగు వెయ్
విజయమాల పడును నీ మెడలోన
నటనమే జీవనమని నమ్ము
ఇకనైనా
ఇదే సత్యము
ఇదే నిత్యము
ఇది తెలుసుకో మనసా
తెలియకపోతే నీకు
పుట్టగతులు లేవు
పిచ్చి మనసా
No comments:
Post a Comment