నేనే క్షమిస్తున్నా
నన్నెవరూ
క్షమించవద్దు
మీకంత స్థాయి
లేనే లేదు
నేనే తప్పూ
చేయలేదు
నన్నెవరూ
మన్నించవద్దు
మీ మనసుకు అంత
విలువలేదు
మనసు మాటే
విన్నా నేను
ఉన్నత శిఖరం
కాదు నా మనసు
నేలమీది జాబిల్లియే
నా మనసు
మనసు
మార్గంలోనే నడిచాను నేను
భిన్నకోణాలు
లేనిది నా మనసు
పరివిధాల
యోచించదు నా మనసు
తనలో మరో
మనిషిని దాచుకోలేదు నా మనసు
వికృతాలను
జీర్ణం చేసుకోలేదు నా మనసు
ప్రతి
ఘడియలోనూ ఒకటే నా మనసు
మరల మరలా
మారనిదే నా మనసు
గులాబీల
బాటలోనూ
రంపపు కోత దారిలోనూ
దిశను
మార్చనిదే నా మనసు
సమాజం
బుసకొట్టినా
రాబందు
బంధువులు రెక్కలాడించినా
మనసు విపణిలో
కాణిగాకున్నా
మారలేదు నా
మనసు
నా దిశను
మార్చలేదు నా మనసు
సమాజమా నువ్వు
చేసిన నేరమే ఇది
నన్ను
మన్నించే స్థాయి నీకెక్కడిది
నిరపరాధినయిన
నేను
నా సువిశాల
మనస్సుతో
నిన్నే
క్షమిస్తున్నా
No comments:
Post a Comment