క్షమించదు నా మనసు
నా కనుల ముందే ఉంటావు
నా ముందే తిరుగుతూ
ఉంటావు
నా వాళ్ళతోనే ఉంటావు
నాలో ఉండవు నీవు
నా మనసులో స్థానం లేనే
లేదు నీకు
రెండు పదుల
అనుబంధాన్ని
మంట గలిపావు నీవు
కుట్రలు కుతంత్రాలతోనే
కాలం గడిపావు నీవు
మగువలో ఎన్ని కోణాలో
గురుతు చేసావు నీవు
నవ్వుతూ పలకరిస్తూ
వెనుక గోతులు
తీసేవారికే చేయూతనిచ్చావు నీవు
శిఖరంలా నిలిచిన
వైభవాన్ని
నేలకూల్చావు నీవు
నీది స్వార్ధమా
లేక మోసమా
భయమా
కారణం ఏదైనా
బంధాన్ని విస్మరించి
రాబందుల మాటలకు లోబడి
నా మనసునే ముక్కలు
చేసావు నీవు
నీ తోటలోనే విరిసిన
పువ్వులకు
ఆకలి మంటలు రుచి
చూపిస్తున్నావు నీవు
సహనానికి మరోపేరు మగువ
దీనిని తిరగరాసావు
నీవు
మనిశివా సర్పికవా
ఏమిటి నీ అసలు స్వరూపం
మౌనంలోనే మంటలు రేపిన
నిన్ను
ఎలా మన్నిస్తుంది నా
మనసు
నువ్వు నాతోనే ఉన్నా
నా కళ్ళముందే ఉన్నా
నాలోనికి ఎన్నటికీ
చేరలేవు
సహనం హద్దులు చెరిపిన
నువ్వు
నీరాతను నువ్వే
మార్చుకున్నావ్
క్షమించదు నా మనసు
నిన్ను
ఇంతకీ ఉండమంటారా మనసులో వద్దాండి :-)
ReplyDeleteపద్మాజీ .....
Delete