వలపు వీణ
మెరిసే మేలిమి బంగారం నాదేహం
కనులనిండా నింపుకొనక దిక్కులు చూస్తావేమి
కురిసే అమృత ధారలు నా ఆధరాలు
నీ పెదాలనిండా దప్పిక తీర్చుకోవేమి
విరిసే వెన్నెల కలువలు నా కన్నులు
సిరివెన్నెల స్నానం చేయక ముడుచుకున్నావేమి
వెచ్చని నీడనిచ్చే మేఘాలే నా నీలి కురులు
చీకటమ్మ వచ్చిందని నీకు భయమెందుకు
అందీ అందని మెరుపు తీగ నా నడుము
అందుకొమ్మంటే ఇంకా నీకు జాగెందుకు
వెండి చందమామ నా వదనం
వెన్నెల రాలేదేమని దిక్కులు చూస్తావెందుకు
అలిగితివా సఖా అలక మానవా ప్రియా
నాలో కలిసిపో కలిసిపోయి కరిగిపో
నీకు నేనే స్వాంతన ప్రియా
జవరాలు తనువంతా మనసై
వలపు వీణలు మీటుతూ
తనలోకి రమ్మని
ఆహ్వానం పలుకుతూ వుంటే
మగసిరి పడగ విప్పదా మరి
This comment has been removed by a blog administrator.
ReplyDelete