పాడవే కోయిలా
ఓ కోయిలా
మరలా వినిపించు నీ గానం
నా మనసు వేచియుంది నీ
కోసమే
తరలిపోయిన వసంతమా
మరలా వినిపించు నీ
రుతురాగం
గుండె ఇంకా
కొట్టుకుంటోంది నీ రాక కోసమే
మూగబోయిన ముద్దబంతీ
మరలా వికసించు
తుమ్మెద సవ్వడి నీ
కోసమే
నిశ్చల నిర్జీవ సాగరమా
పొంగు కెరటాలకు మరలా
జీవం పోయ్
నా జీవం ఎదురు చూపులు
నీ పొంగులకోసమే
భేషజాల పంజరంలో
చిక్కుకున్న విహంగమా
రెక్కల సవ్వడితో
బంధనాలు తెంచెయ్
మనసు పాటలన్నీ నీకోసమే
కోయిల గానం
మనసు పరవశం
యుగళగీతమై
మనసు తోటలో వికసిస్తుంది
మరో పుష్పం
పాడవే కోయిలా మరలా
మనసు గీతం వినిపించవా
మరలా మరలా
No comments:
Post a Comment