మనసే లేని మనిషిని
పరిణామక్రమంలో
ప్రతికూలతలను
ఛేదించి రూపాంతరం
చెందిన
మట్టిజీవిని
భారమైన మనసు రూపాన్ని
త్యజించిన మంచు
దేహాన్ని
మనసు నుంచి మనిషిగా
మారిన
శిథిల శిలాజాన్ని
మనసు రుచిని మరిచిన
బండనాలుకని
మనసు గోసను మనసుతో
చూడవద్దని
శాసించుకున్న మరమనిషిని
కనులు రెండు ఉన్నా
దృశ్యాన్ని
విసర్జించిన కబోదిని
తీయనిపలుకులను
విసిరిపారేసి
చెవులను నిండిన
సీసాన్ని
మనసే లేని దేహం
మనిషిగానే నడుస్తుంది
ఏ మనసెలా మెసిలినా
మనిషిగానే
మసులుకుంటుంది
నింగితారకలు నేలను
ముద్దాడినా
నిశి తెరలను తొలగించదు
నా నయనం
ఇక మనసు వైపు నడవదు నా
గమ్యం
మనసుకు మనసుతో లేదు ఇక
బంధం
మనసునూ మనిషిగానే
చూస్తా ఇక నిత్యం
మనిషిగానే పుట్టిన
మట్టి పురుగుని
మనసు ముసుగు
తొడుక్కున్న మామూలు జీవిని
కాలంతో మారిన సగటు
మనిషిని
మనసును పాతరేసి మారిన
మనిషిని
మనసే లేకపోతే
మమతలెందుకు
మమతలు లేని మనసు ఏమైతే
ఎందుకు
నాలో మనసుంటేగా మరో
మనసు గోస
మనసు కుంపటి ఆరిపోయి
చల్లారిన నిర్జీవిని
No comments:
Post a Comment