నిశ్శబ్దగీతిక
నిన్నటి జ్ఞాపకం ఒక
మంచు మేఘమై
జడివానలు
కురిపిస్తుంటే
ఒక్కో చినుకూ
నాటి అనుభూతుల
చితిమంటలను తలపిస్తుంటే
రగులుతున్న బిందువుల
మంటలకు
దేహంలోని ఒక్కో అంగం
రాలిపోతుంటే
కరిగిపోయిన నా కలలన్నీ
వరదలై ప్రవహిస్తూ ఉంటే
ఏమీ చేయలేక
వరదను ఆపే తరం లేక
నిలిచిపోయాను ఒక
స్వప్నంలా
పొంగి పొరలిన
స్వాప్నిక చినుకులు
నాపైనే పగబట్టి
రగిలిన వేదనల పొగలో
ఆవిరిగా మారి
మరో నల్ల మబ్బులా మారి
మరలా కురుస్తూ ఉంటే
నా దేహం సమస్తం
కరిగి పోయింది మంచు
ముద్దలా
నేనున్నానో లేదో
నేను నేను కాదో అవునో
తెలియని అచేతన
స్థితిలో
మిగిలిపోయాను
నిశ్శబ్ద గీతికలా
ఏమో ఏమో ఇది. నాకేమొ ఏమో అయినది. నా దేహం హిమక్రీమువలె కరగి పోయినది. ఈ కవిత ఇసుక ఎడారి లాంటి నా బతుకులో ఒక మంచు తుఫానులా మారింది.
ReplyDeleteమధురభావం
ReplyDeleteధన్యవాదములు
Delete