శిలగా మిగిలిపోనా కలగా కరిగిపోనా
గతించిన జ్ఞాపకాల
ఆనవాళ్ళు
అడుగుజాడలుగా నడుస్తున్నాయి
ప్రతి అడుగులో ఆ
అనుభవాలు
నా కంటే ముందే
ఉంటున్నాయి
వెక్కిరిస్తున్న
ఆనవాళ్ళు
కాళ్ళకు బంధనాలు
వేస్తున్నాయి
ఏ దిక్కులకు చూపు
సారించినా
మార్గాలను మూసేసి హేళన
చేస్తున్నాయి
మనసు పయనంలో గతం
స్వగతంలా వెన్నాడుతూనే
ఉంది
మనసులో మనసే లేని వైనం
శూలమై దిగబడుతూనే ఉంది
చేతగాని మనసుతనం
మరుగుజ్జులా
మార్చేస్తోంది
ఎన్నటికీ అందని ఆకాశం
నేను చేదే నీకంటూ కొంటెనవ్వులు
విసురుతోంది
అందలాలు కోరుకోని నా
మనసు
కాసింత చోటడిగింది
సూదిమొనకూ కొరగావంటూ
మనసు కుండబద్దలు
కొట్టింది
గతించిన జ్ఞాపకాల
వెల్లువ
సుడిగాలిలా చుడుతుంటే
గతవైభవపు శిథిలాలు
ఏవీ నీ రాచరికాలంటూ
పరిహాసమాడుతూ ఉంటే
ఎలా కదులుతాయి అడుగులు
ఎక్కడ మిగులుతాయి
జాడలు
శిలగా మిగిలిన నేను
ఒక కలగా కరిగిపోనా
మనస్వినీ
No comments:
Post a Comment