మనసు సమాధి
ఏదో తెలియని భావన
నిర్వికారమైన వేదన
శూన్యంలో మూగ రోదన
మనసునుంచి మనసు
మాయమైన యాతన
పరిమళించిన మనసు
ముడుచుకుపోయిన వైనం
ఏమయ్యిందో తెలియని
భావం
మనసులో మథనం
నిలిచిపోయిందా
మనసులో భావాలే
ఆవిరైపోయాయా
ఎగసిపడే కెరటాలు
ఒక్కసారిగా
కుప్పకూలిపోయాయా
అలల సంద్రం మానసం
నిశ్చల నిర్జీవ
తటాకమేనా
ఏదో అయ్యింది మనసుకు
ఎక్కడో గాయం తగిలింది
మనసుకు
మనసు మనసు
విప్పలేకపోతోంది
మనసున గాయం
చూపలేకపోతోంది
పునాదులు వేసిన
గాయంలోనే
మనసు తనను తాను
సమాధి చేసుకుంటున్నది
No comments:
Post a Comment