నిప్పులాంటి నిజాలు
నా అక్షరాలు
ఎక్కడైనా కనిపిస్తాయి
ప్రతి
దిక్కులో నా అక్షరాలే
శూన్యంలోనూ నా
అక్షరాలే
అందు గలవు
ఇందు లేవు అన్నట్లు
అన్నింటా నా
అక్షరాలే
భార్యా భర్తల
అనురాగంలో
రక్తి
కట్టించేది నా అక్షరాలే
ప్రేయసీ
ప్రియుల పదనిసల్లో
నాట్యమాడేది
నా అక్షరాలే
అన్నదమ్ముల
అనుబంధంలో
బంధువులాడే
నాటకంలో
స్నేహితుల
సహకారంలో
స్నేహమనే
ముసుగులో
సత్య దర్పణాలు
నా అక్షరాలే
మనసూ మనసుల
రాపిడిలో
జనియించే
నిప్పు కణికలు నా అక్షరాలే
సమాజంలో
మోసాలను
నిలదీసే సాహస
పుత్రికలు నా అక్షరాలే
కుట్రలు
కుతంత్రాలకు
నిలువెత్తు
సాక్ష్యాలే నా అక్షరాలు
ఎవరికీ సంబంధం
లేనివి నా అక్షరాలు
అన్నింటినీ నిలదీస్తాయి
నా అక్షరాలు
అనురాగంలో
వికసిస్తాయి
అనుబంధంలో
పరిమళిస్థాయి
ఘర్షణలో
రగిలిపోతాయి
మోసాన్ని
ప్రశ్నిస్తాయి
స్నేహానికి
తలవంచుతాయి
నిప్పులాంటి
నిజాలే నా అక్షరాలు
అల్లుకున్న
అక్షరాలతో వికసించిన భావనలు
నా జీవితం
కాదు
ప్రతి
జీవితంలో
పరకాయ ప్రవేశం
చేసే
చైతన్య
దీపికలు నా అక్షరాలు
నా భావాలోకంలో
నేనే ఉన్నా
అదే నా జీవితం
కాదు
మనస్వినీ
No comments:
Post a Comment