జ్ఞాపకాల బాటలో
విసిరేసిన జ్ఞాపకాలను
మరలా తీసుకుపో
అలజడి రేగితే జారిపోకుండా
గుండెకు పొదివి
పట్టుకో
మనసుకు తగిలిన గాయాలకు
మమతల లేపనం పూసిపో
దీపం ఆరిన గుడిలో
మనసు దీపం వెలిగించి
పో
తడియారిన పెదవులపై
చిరునవ్వుల రంగు అద్ది
పో
బీడు వారిన మనోసీమపై
పన్నీటి వానై కురిసి
పో
నీ కనుల వెన్నెల
కురిస్తే చాలు
నా జ్ఞాపకాలు మరలా
వికసిస్తాయి
విరిసిన జ్ఞాపకాలను
మనసు నిండా నింపుకో
నీతో నడుస్తున్న
జ్ఞాపకాల
బాటలో నేనూ నడిచిరానా
మనస్వినీ
No comments:
Post a Comment