కథానాయికవే నువ్వు
జాలువారుతున్న
అక్షరాలను
పొదివి పట్టుకుంటున్నా
మనసు నింగిలో
నక్షత్రాలుగా అద్దుకున్నా
రాలుతున్న నక్షత్రాల
పొడిని
లేపనంగా మలుచుకుని
నీ బొమ్మగా
మార్చుకున్నా
రెక్కలు విచ్చుకున్న
తొలి అక్షరాన్ని
నీ పూజలో పువ్వులా అల్లుకున్నా
నీలినింగిలో పక్షుల్లా
తోటలో పువ్వులా
నీ పదమంజీరంలా
నీ తీయని పలుకులా
నీ నయనాల వెన్నెలలా
నా ప్రతిభావాన్నీ
నీలోనే చూసుకున్నా
నీకేం తెలుసు
నా భావజగతిలో
నిన్నే మారాణిలా
నిలుపుకున్నా
ఒక్కసారి నా మనసులోకి
తొంగి చూడు
నేను నీలోనే
జీవిస్తున్నా
నీలోనే మరణిస్తున్నా
ఆదినుంచి
అంతం వరకు
నా కథానాయికవు నువ్వే
మనస్వినీ
No comments:
Post a Comment