మనసుల ఆరాటం
సవ్వడి చెయ్యని గాలిలో
మాటలు మరిచిన మౌనంలో
కనులతోనే కనులను
పలకరిస్తూ
శ్వాసలోనే మాటలు
సవరిస్తూ
చెమట గంధంలో పునీతమవుతూ
సమరం చేస్తున్న
తనువులు
ఓడేది ఎవరు
గెలిచేది ఎవరు
గెలిచిన దేహమే ఓడింది
ఓడిన దేహమే గెలిచింది
అలసి సొలసిన దేహాలు
మరలా పెనవేసుకున్నాయి
సమరం స్థంబించినా
పరిష్వంగం వీడలేదు
అప్పుడే జారిపడిన ఓ
వెచ్చని చెమట చుక్క
ఫక్కున నవ్వింది
మీ దేహాల ఆరాటం తీరదు
మీ తనువుల పోరాటం ఆగదు
ఇది మీ దేహాల ఆకలి
కాదు
మీ తనువుల పోరాటం కాదు
ఇది ఇరుమనసుల ఆరాటం
ఆకలి మనసుకే కాని
దేహాలది కాదంటూ
చెమట చుక్క
ఆవిరైపోయింది
మనస్వినీ
No comments:
Post a Comment