నీ రూపమే
వెచ్చగా జారిపడుతున్న
కన్నీటి చుక్కను అడుగు
నీవు లేని సమయాన అది
ఎందుకు జారిందో
ఆ ఉప్పునీటిలో ఎంత
తేనీయ దాగి ఉందో
తీయని తేనీయలో వెతుకు
ఎంత వేదన రగులుతోందో
అందరూ ఉన్నా
అంతా సవ్యంగానే
కనిపిస్తున్నా
ఏదో తెలియని వెలితిని
అడుగు
శూన్యంలో చూస్తూ
వెక్కిరిస్తున్న ఒంటరితనాన్ని అడుగు
ఒంటరితనంలో మిగిలిన
ఆవేదనతో
రగిలిన మనసును అడుగు
మాటల తూటాలతో పగిలిన
మనసు ముక్కల రోదనను అడుగు
నాకు నీపై ఎంత ప్రేమో
జారిపడిన కన్నీటి
చుక్కలో
మెరిసేది నీరూపమే
ఉప్పునీటి వెగటులో
మధురమైన తేనీయ నీవే
రగిలిన వేదనలో చలి మంటవు
నీవే
ఒంటరి వేళ మనసుకు
పలకరింపు నీవే
పగిలిన మనసు ముక్కల్లో
కనిపించే
బొమ్మలు నీవే
పగిలిన మనసు ముక్కలను
ఒక్కసారి కలిపి చూడు
కనిపించేది నీ రూపమే
No comments:
Post a Comment