అది నీవే
ఈ చీర రంగు బావుందా
ఈ జరీ అంచు ఈ చీరకు
బావుంటుందా
ఈ బ్లౌజ్ చీరకు మ్యాచ్
అయ్యిందా
ఈ చీరలో ఎలా ఉంటాను
ఈ చీర రంగు నాకు సూట్
అవుతుందా
శరపరంపర ప్రశ్నలకు
ఏమని సమాధానం చెప్పను
చీర రంగు బాలేదు
జరీ అంచు సూట్ కాదు
బ్లౌజ్ మ్యాచ్ కానే
కాదు
అవును
నేను చెప్పేది నిజమే
స్వతహాగా అవేవీ నచ్చవు
నాకు
ఏ రంగూ ఇంపు కాదు నాకు
జరీ అంచు కంటికి ఆనదు
నాకు
నిజమే
ఏ రంగు చీర అయినా
నీకోసం రంగు మార్చుకోవాల్సిందే
జరీ అంచు కూడా తన
మెరుపులకు మెరుగులు పెట్టుకోవాల్సిందే
బ్లౌజు వంపులు కూడా నీ
ఒంపులకు సలాము చేయాల్సిందే
వస్త్రాలు నీకు
అలంకారాలు కాదు
నీ దేహాన్ని
హత్తుకున్న వస్త్రాలకు నీవల్లనే విలువ పెరుగుతుంది
ఆభరణం నీకు విలువ కాదు
ఆభరణాలకు విలువ
పెంచేది నీ దేహం
కట్టుబొట్టుకు ప్రాణం
పోసేది నీ సోయగం
అందాన్ని అందలాలు
ఎక్కించేది
ఇంకేదో కాదు
అది నీవే
మనస్వినీ
No comments:
Post a Comment