లేపనం కాని మనసు
సిగలో పువ్వులా
నవ్వాలని అనుకున్నా
కాలిలో ముల్లులా
గుచ్చుకున్నా
తగిలిన గాయానికి లేపనం
కావాలనుకున్నా
మరో గాయానికి మార్గమై
నిలిచున్నా
జారిపడిన కన్నీటిని
దోసిటపట్టాలని అనుకున్నా
ఆ కంటిలో నలుసులా
మిగిలియున్నా
ఆ పెదాలపై చిరునవ్వునై
చిందించాలనుకున్నా
ఆ తేనియ పలుకుల్లో
గరళమై మిగిలియున్నా
నా భావం
నా అంతరంగం
నా ఆలోచన
నా వేదన
నా రోదన
అన్నీ నా మనసుకే
తెలుసు
మనసు వెతలను
తెలుసుకోలేని మనసు ఎదుట
శూన్యమై కరిగిపోతున్నా
No comments:
Post a Comment