సవ్వడినై పలకరిస్తాను
ఎంత శిథిలమైపోయాను
నేను
చిరుగాలి సవ్వడికే
రాలిపోతున్నాను...
ఎంత చితికిపోయాను నేను
తడిసిన కాగితంలా
ముక్కలైపోతున్నాను...
బతుకు బాట సాగిస్తూనే
ఉన్నాను నేను
జీవితాన్ని ఎక్కడో
జారవిడుచుకున్నాను...
జలపాతానికి నిచ్చెనలు
వేస్తున్నాను నేను
తెగిన తామర రెక్కలుగా
కొట్టుకుపోతున్నాను...
మడుగు చేరిన వానలో
కాగితం పడవ ఎక్కాను
ఎంత అనుకున్నా
మునగలేకపోతున్నాను...
పూలగుత్తిలో ఒక
జ్ఞాపకంలా మిగిలాను
సుగంధపరిమళమై గాలిలో
కలిసిపోతున్నాను...
ఎంత బలమై నిలిచాను
నేను
కణాలుగా విడివడి నక్షత్రాలలో
కలిసిపోతున్నాను...
ఎక్కడ దాగి ఉన్నాను
నేను
హృదయస్పందనల సవ్వడిలో పలకరిస్తూనేఉంటాను...
No comments:
Post a Comment