ఆ నవ్వు
చాలు పూబంతీ ...
చిరు
ముద్దు సంతకంతో
చిగురించిన
ఉషోదయం
నడిరేయి
అలసటను మరిచిన నీవు
పరవళ్ళు
తొక్కే నదిలా
వికసించిన
పుష్పంలా
వెలుగులు
విరజిమ్ముతుంటే
బడలికగా
లేచిన నేను
కళ్ళు
నులుపుకుని చూసాను
మెరిసే
ఆ కన్నుల వెలుగులే
గుడ్
మార్నింగ్ అంటూ పలకరించాయి...
వర్షం
కురిసిన మట్టి వాసనను ఆస్వాదిస్తూ
పిల్లగాలుల
అనుభూతిని పొందుతూ
అప్పుడే
మొలకలు వేస్తూ సూరీడు విసిరిన
నులివెచ్చని
స్పర్శను నరాలలోకి ఎక్కిస్తూ
వీధిలో
అటూ ఇటూ తిరుగుతున్న నాకు
తెలుస్తూనే
ఉంది
నువ్వు
నన్నే గమనిస్తున్నావని
అంత
దూరంనుంచి కూడా నీ చూపులు
నా
దేహాన్ని తడుముతున్నాయి మరి...
ఇక చాలు
ఈ నడక అనుకుంటూ
నీవైపు
అడుగులు వేసిన నేను
గేటు
దగ్గర నిలిచి
విరిసిన
పూబంతిలా నవ్వులు విసురుతున్న
నిన్ను
చూసాను
ఆ క్షణం
అనిపించింది నాకు
ఇదేనేమో
జీవితమంటే
నీకు
తెలుసో తెలియదో కానీ
ఆ పసిడి
నవ్వులు చాలు
బతుకంతా
జీవించేందుకు
మనస్వినీ...
No comments:
Post a Comment