జారిపోయింది నా చిరునామా
గల్లంతయ్యాను
నేను ఎక్కడో
కోల్పోయాను
నన్ను నేను ఎక్కడో
నానుంచి
నేను విడిపోయాను ఎక్కడో
జారిపోయింది
నా చిరునామా ఎక్కడో
ఎక్కడని
వెతకను నా విలాసం ఎక్కడో
నింగి
తారకలను అడిగాను
చెప్పమని
నేనెక్కడో
చందమామను
బతిమాలా
తెలపమని
నేనెక్కడో
పిల్లగాలులను
తడిమి చూసా
ఉన్నానేమో
ఎక్కడో
రాలుతున్న
కన్నీటిని తరచి చూసా
ఇంకిపోయానేమోనని పుడమిలో ఎక్కడో
కరుగుతున్న
స్వప్నాలలో కాగడా పెట్టి చూసా
ఆవిరినయ్యానేమోనని
ఎక్కడో
రెక్కలు
విప్పిన సంధ్యలో కనులు పెట్టి చూసా
ఒరిగిపోయానేమోనని
ఎక్కడో
ప్రభవించిన
ఉషస్సును అడిగా
ఉదయిస్తున్నానేమోనని
ఎక్కడో
ప్రకృతి
సమస్తాన్ని జల్లెడపట్టిచూసా
దాగి
ఉన్నానేమోనని ఎక్కడో
విప్పారిన
నీ నేత్రాలను చూసా
ఆడుకుంటున్నా
నీ వెన్నెలలో
మనస్వినీ
No comments:
Post a Comment