అన్నా వేమన్నా
తినగ తినగ వేము తియ్యగ
నుండు
వేమన్నా ఏమన్నా
నీకెలా తోచిందన్నా
అప్పట్లో నువ్వు
చెప్పిన ఈ మాట
ఇప్పటికీ వరాల మూటగా
నిలిచిందన్నా
తినగ తినగ వేము
అన్నావ్
అనగ అనగ రాగమన్నావ్
జీవిత సత్యాన్ని
ఎంతబాగా చెప్పావన్నా
ఒకటే మాట
ఒకటే ఆరోపణ
నిత్యం నా చెవుల మారు
మ్రోగుతుంటే
అది నిజమై నా మనసులో
ముద్ర వేసిందన్నా
అందుకే నేనిదే
నేనిలాగే చూస్తా
నా పద్దతి ఇంతే అని
తెగేసి చెబుతున్నా
అల్పుల పలుకులు
ప్రియములై
ప్రియమైన మనసు తూటాలు
విసురుతూ ఉంటే
సహనం నశించి
తిరుగుబాటు చేస్తున్నా
నిండా మునిగిన మనసుకు
ఇంకా చలేమిటన్నా
చావో రేవో అంటూ మనసు
తిరుగుబాటు చేస్తోందన్నా
అన్నా వేమన్నా
నీ వాక్కులు నేటికీ
అక్షరసత్యాలన్నా
No comments:
Post a Comment